ఉగాది నుండి ‘బంగార్రాజు’

Nagarjuna Bangarraju Movie,Bangarraju Movie Shoot Begin This Ugadi,Bangarraju Movie Shooting,Bangarraju Movie Latest News,Nagarjuna,Bangarraju Telugu Movie,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

కింగ్ నాగార్జున కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2016 సంక్రాంతి కానుకగా విడుదలై అశేష తెలుగు ప్రజానికాన్ని విశేషంగా ఆకట్టుకుంది. కట్ చేస్తే… నాలుగేళ్ల విరామం అనంతరం ఈ బ్లాక్ బస్టర్ మూవీ కి కొనసాగింపు చిత్రం తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే తెరకెక్కనున్న ఈ సీక్వెల్ లో నాగార్జున తో పాటు ఆయన తనయుడు, యువసామ్రాట్ నాగచైతన్య కూడా మరో హీరోగా నటించనున్నాడు. కాగా, నాగార్జున స్వయంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉగాది సందర్భంగా మార్చి 25న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఆపై చకచకా చిత్రీకరణ జరిపి 2021 ఆరంభంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

మరి.. ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో సంచలనం సృష్టించిన నాగ్, కళ్యాణ్ కృష్ణ.. ‘బంగార్రాజు’ తోనూ అదే మ్యాజిక్ ని కొనసాగిస్తారేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.