మ‌రోసారి వారం గ్యాప్ లో థ‌మ‌న్ చిత్రాలు

Thaman Comes With Back To Back Movies Once Again

వ‌రుస విజ‌యాల‌తో నంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ కంపోజ‌ర్ గా దూసుకుపోతున్నాడు యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్. తాజాగా `వెంకి మామ‌`, `ప్ర‌తీ రోజూ పండ‌గే`, `అల వైకుంఠ‌పుర‌ములో`తో హ్యాట్రిక్ కొట్టిన థ‌మ‌న్.. ఈ ఏడాది ప‌లు చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు. మ‌రీ ముఖ్యంగా… వేస‌విలో రెండు వ‌రుస వారాల్లో కొత్త చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆ వివ‌రాల్లోకి వెళితే… `సుప్రీమ్` హీరో సాయితేజ్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` మే 1న రిలీజ్ కానుండ‌గా.. మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబోలో తెర‌కెక్కుతున్న `క్రాక్`మే 8న విడుద‌ల కానుంది. ఈ రెండు సినిమాల‌కూ థ‌మ‌న్ బాణీలే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని ఇన్ సైడ్ ఇన్ ఫ‌ర్మేష‌న్.

[custom_ad]

కాగా, ఇలా బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో థ‌మ‌న్ నుంచి సినిమాలు రావ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనూ ప‌లుమార్లు ఇలా సంద‌డి చేసిన వైనం ఉంది. ఇక వెరీ రీసెంట్ గా `వెంకి మామ‌` (డిసెంబ‌ర్ 13), `ప్ర‌తి రోజూ పండ‌గే` (డిసెంబ‌ర్ 20)తో బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో బ్లాస్ బ‌స‌ర్ట్స్ చూశాడు. మ‌రి… `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్`, `క్రాక్`కి కూడా ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.