ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ కన్నడ మూవీ “కె.జి.ఎఫ్ చాప్టర్ 1” ఘనవిజయం సాధించి పలు రికార్డ్స్ నెలకొల్పిన విషయం తెలిసిందే. శాండల్ వుడ్ చరిత్రలో 200కోట్లకు పైగా వసూళ్ళు సాధించి, హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ రూపొందుతుంది. రవి బస్రూర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో స్టార్ హీరో యశ్ కథానాయకుడు గా “కె.జి.ఎఫ్ చాప్టర్ 2” మూవీ శరవేగంగా రూపొందుతుంది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. “కె.జి.ఎఫ్ చాప్టర్ 2” మూవీ షూటింగ్ ముగింపు దశ లోఉంది. ప్రస్తతం మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆఖరి షూటింగ్ షెడ్యూల్ ను చిత్ర యూనిట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ప్లాన్ చేసింది. త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీ ప్రారంభమయ్యే షూటింగ్ లో హీరో, హీరోయిన్స్ తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటారు. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న “కె.జి.ఎఫ్ చాప్టర్ 2” మూవీ కన్నడ భాషతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























