`ఈశ్వర్`(2002)తో కథానాయకుడిగా తొలి అడుగేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆపై చిత్రచిత్ర ప్రవర్ధమానంగా ఎదిగి.. `బాహుబలి` సిరీస్ తో నేషనల్ స్టార్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో పలకరిస్తూ వచ్చిన ప్రభాస్.. ఈ మధ్య కాస్త శైలి మార్చి రెండేళ్ళకో సినిమాతో సందడి చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇంకా చెప్పాలంటే.. `మిర్చి` ముందు వరకు ఒకలా, తరువాత మరోలా ప్రభాస్ శైలి ఉంది. `మిర్చి` ముందు వరకు ఏడాదికి ఒకట్రెండు సినిమాలతో సందడి చేసిన మన యంగ్ రెబల్ స్టార్.. `మిర్చి` (2013) తరువాత `బాహుబలి` (2015), `బాహుబలి 2` (2017), `సాహో` (2019).. ఇలా రెండేళ్ళకో చిత్రంతో పలకరించాడు. ఇక తదుపరి చిత్రం విషయానికి వస్తే.. 2021లో థియేటర్లలో సందడి చేయనుంది.
[custom_ad]
మొత్తమ్మీద… పాన్ – ఇండియా స్టార్ గా టర్న్ అయ్యాక ప్రభాస్ కి `జీరో రిలీజెస్ ఇయర్` అనే మాట కామన్ అయిపోయింది. 2021 నుంచి అయినా మన `డార్లింగ్`.. ఏడాదికో చిత్రంతో, `మిర్చి`కి ముందు శైలితో వినోదాల విందు అందిస్తాడేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























