నిధి అగ‌ర్వాల్ ఫ‌స్ట్ కోలీవుడ్ ఫిల్మ్ కి రిలీజ్ డేట్ ఫిక్స్

Nidhhi Agerwal Kollywood Debut Film Gets Final Release Date

`స‌వ్య‌సాచి`(2018)తో తెలుగునాట క‌థానాయిక‌గా తొలి అడుగు వేసిన నిధి అగ‌ర్వాల్.. మ‌లిచిత్రం `మిస్ట‌ర్ మ‌జ్ను`(2019)తోనూ ఆశించిన విజ‌యం అందుకోలేక‌పోయింది. అయితే, గ‌త ఏడాది జూలైలో వ‌చ్చిన‌ `ఇస్మార్ట్ శంక‌ర్`… నిధి కెరీర్ ని అనూహ్యంగా మ‌లుపు తిప్పింది. ఈ సినిమా అందించిన విజ‌యంతో మ‌రిన్ని అవ‌కాశాల‌ను మూట‌గ‌ట్టుకుందీ టాలెంటెడ్ బ్యూటీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఈ నేప‌థ్యంలోనే… ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళంలోనూ సినిమాలు చేస్తోంది. కాగా, నిధి అగ‌ర్వాల్ తొలి త‌మిళ చిత్రం `భూమి` చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. `జ‌యం` ర‌వి హీరోగా న‌టిస్తున్న ఈ గ్రామీణ నేప‌థ్య చిత్రంలో… నిధి ప‌ల్లెటూరి యువ‌తిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ల‌క్ష్మ‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే1న జ‌నం ముందుకు రానుంది. మ‌రి.. తొలి త‌మిళ చిత్రంతో నిధి ఏ స్థాయి విజ‌యాన్ని అందుకుంటుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.