`అఖిల్ 4`కి `అల్లు అర‌వింద్ ఫ్యాక్ట‌ర్` అచ్చొస్తుందా?

Allu Aravind Factor Works For Akhil 4 Movie?

ఇటీవ‌ల కాలంలో అల్లు అర‌వింద్ నిర్మాణంలో, స‌మ‌ర్ప‌ణ‌లో వ‌స్తున్న చిత్రాల‌న్నీ విజ‌య‌ఢంకా మ్రోగిస్తున్నాయి. అంతేకాదు.. ట్రాక్ త‌ప్పిన క‌థానాయ‌కుల‌కు కెరీర్ బెస్ట్ హిట్స్ కూడా వ‌రిస్తున్నాయి. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన `గీత గోవిందం`తోనే విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకోగా.. ఆ త‌రువాత వ‌చ్చిన `నోటా` నిరాశ‌ప‌రిచింది. అయితే, గీతా ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన `టాక్సీవాలా`తో విజ‌య్ కి మ‌ళ్ళీ స‌క్సెస్ ద‌క్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక `సుప్రీమ్` త‌రువాత సాలిడ్ హిట్ లేని సాయితేజ్ కి… అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన `ప్ర‌తి రోజూ పండ‌గే` కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ ని అందించింది. అలాగే `నా పేరు సూర్య‌` ఫ‌లితంతో నిరాశ‌ప‌డ్డ అల్లు అర్జున్ కి… గీతా ఆర్ట్స్ నిర్మాణ భాగ‌స్వామ్యంలో వ‌చ్చిన `అల వైకుంఠ‌పుర‌ములో` కెరీర్ బెస్ట్ హిట్ ని అందించింది.

[custom_ad]

ఈ నేప‌థ్యంలో… క‌థానాయ‌కుడిగా ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన విజ‌యం లేని అక్కినేని యంగ్ హీరో అఖిల్.. ప్ర‌స్తుతం అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లోనే `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ సినిమా చేస్తుండ‌డంతో… స‌హ‌జంగానే ఆస‌క్తి నెల‌కొంది. మ‌రి… `అల్లు అర‌వింద్ ఫ్యాక్ట‌ర్`తోనైనా టాలెంటెడ్ యంగ్ హీరో అఖిల్.. తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 4 =