‘జాను’ టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

Jaanu Movie Teaser To Out Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Jaanu Movie Updates,Jaanu Telugu Movie Latest News,Jaanu Teaser Release Date,Jaanu Telugu Movie Teaser Release Date Confirmed,Jaanu Teaser Release Date Fixed

ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ‘జాను’ టీమ్ ఇప్పుడు వరుస పెట్టి అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. నిన్ననే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్, టైమ్ ను కూడా ఫిక్స్ చేసింది. రేపు అంటే జనవరి 9 వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా పోస్టర్ ద్వారా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ’96’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా న‌టిస్తున్న ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్.

కాగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. మరి తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష ఈ సినిమాకు ప్రాణం పోశారు అని చెప్పొచ్చు. ఇక శర్వానంద్, సమంత మొదటిసారి జోడీ కడుతున్న ఈ మూవీ రిలీజ్ పై తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం తెలుగులో శర్వానంద్, సమంత ఏ మేరకు మెప్పిస్తారో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.