మెగాస్టార్ చిరంజీవి పాత టైటిల్స్… కొత్త చిత్రాలకు చిరునామాగా నిలవడం ఇప్పుడు ఓ ట్రెండ్ గా మారింది. నిరుడు `ప్రాణం ఖరీదు, రాక్షసుడు, గ్యాంగ్ లీడర్, ఖైదీ, దొంగ`… ఇలా చిరు టైటిల్స్ తో ఐదు సినిమాలు వచ్చాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్ చిత్రానికి `మాస్టర్` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. `ఖైదీ` ఫేమ్ లోకేష్ కనకరాజ్ దీనికి దర్శకుడు కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, ఈ పరంపరలోనే ఇప్పుడు మరో కోలీవుడ్ స్టార్ సినిమా తెలుగు వెర్షన్ కి మెగాస్టార్ టైటిల్ ని అనుకుంటున్నారట. ఆ వివరాల్లోకి వెళితే… ధనుష్ హీరోగా ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో `పట్టాస్` పేరుతో ఓ మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కింది. జనవరి 16న తమిళనాట విడుదల కానున్న ఈ చిత్రాన్ని తెలుగులో `రుస్తుం` పేరుతో అనువదించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో చిరు హీరోగా ఇదే `రుస్తుం` (1984) పేరుతో ఓ సినిమా వచ్చిన విషయం విదితమే. ఇప్పుడా టైటిల్ నే ధనుష్ మూవీ తెలుగు వెర్షన్ కి ఎంపిక చేశారని టాక్. త్వరలోనే `రుస్తుం` టైటిల్ పై క్లారిటీ వస్తుంది.
`పట్టాస్`లో ధనుష్ ద్విపాత్రాభినయం చేయగా, అతనికి జోడీగా స్నేహ, మెహరీన్ నటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: