బాలీవుడ్ లోకి ‘వెంకీమామ’..?

Venky Mama Goes To Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Venky Mama Movie Latest News,Venky Mama Movie Updates,Venky Mama Movie Enter Into Bollywood,Venky Mama Movie To Remade In Bollywood

బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ ‘వెంకీమామ’. 2019, డిసెంబర్ 13వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇప్పటికే రిలీజ్‌ దాదాపు మూడు వారాలు అవ్వొస్తున్నా మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. రూలర్‌, ప్రతీ రోజూ పండగే లాంటి సినిమాలు విడుదలైనా కూడా వెంకీ మామ జోరు తగ్గలేదు. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను డి.సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించగా.. థ‌మ‌న్ సంగీతం అందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాను చూసిన కొంతమంది బాలీవుడ్ నిర్మాతలు సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సురేష్ బాబుకు మంచి ఫ్యాన్సీ రేట్ ని కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే బాలీవుడ్ లో సినిమా స్క్రీన్ ప్లేను కాస్త మార్చే అవకాశం ఉన్నట్లు టాక్. అంతేకాదు.. కోలీవుడ్ లో కూడా సినిమాని రీమేక్ చేయడానికి కొంతమంది హీరోలు ఆసక్తి చూపుతున్నారట. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.