మెగాస్టార్ చిరంజీవి.. రాజశేఖర్ మధ్య కోల్డ్ వార్ గత కొద్ది కాలంగా నడుస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య వున్నా విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇండస్ట్రీలోని పలువురు పెద్దల సమక్షంలో పార్క్ హయత్ హోటల్‌లో 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.మా డైరీ ని మెగా స్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతుండగా… రాజశేఖర్ పదే పదే అడ్డుపడటమే కాకుండా… ఆయన నుంచి మైకు కూడా లాక్కొన్నాడు. దీనితో అక్కడ ఉన్న వారందరూ ఆశ్యర్యానికి గురికాగా.. మైక్ తీసుకున్న రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తమను తొక్కేస్తున్నారంటూ బాధను వ్యక్తం చేశాడు. మా అసోసియేషన్ వల్ల తన ఫ్యామిలీలో కూడా గొడవలు వచ్చాయన్న ఆయన.. తనకు కారు ప్రమాదం కూడా ఇందువల్లే జరిగిందన్నారు. నిందలొచ్చినా ఫర్లేదని.. తాను ఎప్పుడూ నిజమే చెబుతానని అంటూ వేదికపై ఉన్న ప్రముఖులందరికీ రాజశేఖర్ కాళ్లు మొక్కారు. అంతేకాదు.. ‘మా’ డైరీ ఆవిష్కరణలో ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. చిరంజీవి ’మా’ లో ఒక మెంబర్ మాత్రమే. ఆయనకు అంతలా ప్రాధాన్యత ఇవ్వడం బాగోలేదన్నాడు. అందుకే ఇలా చేసాను అంటూ చెబుతూ వేదిక నుంచి దిగి వెళ్లిపోయారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీనిపై స్పందించిన చిరంజీవి ప్రోటోకాల్ పాటించని వ్యక్తుల గురించి ఏం మాట్లాడగలమని.. ఇక్కడ తన మాటకు విలువే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాజశేఖర్‌కు తాను అన్నీ అర్ధమయ్యేలా చెప్పానని.. మంచి ఉంటే మైకులో చెప్పమని.. చెడు ఉంటే చెవిలో చెప్పాలన్నానని స్పష్టం చేశారు. అయినా కూడా వినకుండా తన నుంచి మైకు లాక్కోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కాగా, పథకం ప్రకారమే రసాభాస చేసేందుకు రాజశేఖర్ యత్నించారని చిరంజీవి ఆరోపించారు. అంతేకాకుండా రాజశేఖర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
మరి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా..? ఇలానే కొనసాగుతుందా..? చూద్దాం ఏం జరుగుతుందో..!
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























