అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో సుహాస్, చాందిని చౌదరి జంటగా కామెడీ ఎంటర్ టైనర్ “కలర్ ఫోటో ” మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. 1995 సంవత్సరం నాటి ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో జరిగిన ప్రేమకథ ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది. “కలర్ ఫోటో ” మూవీలో ఒక కీలక పాత్రకు సునీల్ ఎంపికయ్యారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుమారు 175 మూవీస్ లో నటించి తన కామెడీ తో ప్రేక్షకులను అలరించిన సునీల్ హీరోగా మారి నటించిన అందాలరాముడు, మర్యాద రామన్న, పూల రంగడు, తడాఖా , భీమవరం బుల్లోడు మూవీస్ ఘనవిజయం సాధించాయి. సునీల్ హీరో గా నటించిన కొన్ని సినిమాలు పరాజయం పొందటం తో సునీల్ తిరిగి కమెడియన్ గా మారి సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు సునీల్ “కలర్ ఫోటో ” మూవీ లో విలన్ గా నటించడం విశేషం. “కలర్ ఫోటో ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ హీరో నాని చేతుల మీదుగా 29 వ తేదీ రిలీజ్ అయ్యింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























