టిడిపి ఎంపి గల్లా జయదేవ్, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరో గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక అప్పుడు ఈషూటింగ్ ను స్టార్ట్ చేసిందో లేదో.. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రేపటినుంచి హైదరాబాద్ లో జరిగే సెకండ్ షెడ్యూల్ లో జగపతిబాబుపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.
కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు. గల్లా జయదేవ్ సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందిస్తున్నారు. మరి ఇప్పటికే కృష్ణ దగ్గర నుండి మహేష్ బాబు, సుధీర్ బాబు, మంజుల ఇండస్ట్రీలో తమ కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. మరి అశోక్ ఏ మేరకు తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తాడో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























