ప‌వ‌న్ సినిమాకి కీర‌వాణి బాణీలు?

Keeravani To Compose Music For Power Star Movie

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిల్వ‌ర్ స్క్రీన్ పై రీ-ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలుత `పింక్` రీమేక్ లో న‌టించ‌నున్న ప‌వ‌న్… ఆ త‌రువాత క్రిష్ రూపొందించ‌నున్న కాస్ట్యూమ్ డ్రామాలో సంద‌డి చేయ‌బోతున్నాడ‌న్న‌దే ఆ క‌థ‌నాల సారాంశం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ న‌టించ‌బోయే సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీల‌ను అందించ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ఈ మేర‌కు క్రిష్, కీర‌వాణి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని టాక్. అదే గ‌నుక నిజ‌మైతే… ప‌వ‌న్, కీర‌వాణి కాంబోలో వ‌చ్చే మొద‌టి సినిమా ఇదే అవుతుంది.

మెగా కాంపౌండ్ లో మెగాస్టార్ చిరంజీవి కాంబోలో `ఘ‌రానా మొగుడు` (1992), మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో `మ‌గ‌ధీర‌` (2009)తో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలి చిత్రం `గంగోత్రి` (2003)కి చార్ట్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్స్ ఇచ్చాడు కీర‌వాణి. ఆ యా చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి కూడా. ఈ నేప‌థ్యంలో… ప‌వ‌న్ తో ఫ‌స్ట్ టైమ్ చేయ‌బోతున్న కీర‌వాణి… ఆ స్థాయి ఆల్బ‌మ్ ని అందిస్తాడేమో చూడాలి.

ఇక క్రిష్ కాంబినేష‌న్ లోనూ `వేదం`, `య‌న్టీఆర్` బ‌యోపిక్ సినిమాలు చేశాడు కీర‌వాణి. త్వ‌ర‌లోనే కీర‌వాణి ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + one =