‘దర్బార్’ నుండి రెండో పాట రిలీజ్

Darbar Movie Second Single Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Darbar Movie Updates,Darbar Telugu Movie Latest News,Darbar Songs,Darbar Movie Songs,Darbar Telugu Movie Songs

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమానుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. ‘ధుమ్మూ ధూళీ’ అంటూ సాగే మొదటి పాత బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తాజాగా రెండో పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ‘ డుమ్ డుమ్’ అంటూ వచ్చే ఈ పాట లిరికల్ వీడియో ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్ , మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దర్బార్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను NV ప్రసాద్, UV వంశీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.