ఫైనల్లీ థియేటర్స్ కు వస్తున్న ‘ఉత్తర’

Utthara Movie Gets A Release Date

ఎస్ఆర్ తిరుపతి దర్శకత్వంలో శ్రీరామ్, కారుణ్య కాథరిన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘ఉత్తర’ సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్న ఈ సినిమా పోస్టర్స్ దగ్గరనుండి టీజర్, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జనవరి 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతే ఈ సినిమాకు మంచి పాజిటివ్ బజ్ వస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయట. మరి చూద్దాం సినిమా ఎలా ఉంటుందో..

కాగా రోమాంటిక్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాను లైవ్ ఇన్ సి క్రియేషన్స్ , గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ఆర్ తిరుపతి, శ్రీపతి గంగాదాస్ సంయుక్తంగా ఈ సినిమాకు నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో వేణు, అభయ్, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.