మెసేజ్ ఓరియెంటెడ్ “శ్రీమంతుడు “, “జనతా గ్యారేజ్ “, “భరత్ అనే నేను ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో #CHIRU 152 మూవీ రూపొందనుందనే విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా రూపొందే మూవీ పూజ కార్యక్రమం జరుపుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ గా రూపొందనున్న ఈ మూవీ లో చిరంజీవి ఒక ప్రభుత్వ ఉద్యోగి గా నటిస్తున్నట్టు సమాచారం. సీనియర్ హీరోయిన్ త్రిష కథానాయికగా ఎంపిక అయ్యారు. చిరంజీవి, త్రిష జంటగా “స్టాలిన్ ” మూవీ తో ప్రేక్షకులను అలరించారు. 13 సంవత్సరాల తరువాత వారిద్దరూ మరోసారి జత కట్టడం విశేషం. హైదరాబాద్ లో ఒక హౌస్ సెట్ లో డిసెంబర్ 26వ తేదీ #CHIRU 152 షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























