ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటుంది ఓ హీరోయిన్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు లవ్లీ సినిమాతో సినీ తెరకు పరిచయమైన శాన్వి శ్రీవాత్సవ. లవ్లీ తర్వాత శాన్వి పలు సినిమాల్లో నటించినా అవి సరైన విజయం దక్కించుకోక పోవడంతో సరైన అవకాశాలు రాక టాలీవుడ్ కు దూరమైంది. ప్రస్తుతం కన్నడలో సినిమాలు చేస్తుంది ఈ భామ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సచిన్ అనే దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా శాన్వి హీరోయిన్ గా ‘అతడే శ్రీమన్నారాయణ’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని కన్నడంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రయిలర్ లను ఇప్పటికే రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై బాగానే అంచనాలు వున్నాయి.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన శాన్వి కాస్త భావోద్వేగానికి గురైంది. రౌడీ సినిమా తర్వాత నాకు ఇక్కడ ఛాన్స్ లు రాలేదు.. దాదాపు ఏడాదిన్నర సినిమాలు లేకుండా వున్నాను. ఆ టైం లో నా కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది.. నాకు ఇంకొక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నా అని శాన్వి ఎమోషనల్ అయింది. మరి చూద్దాం మన ఫిలిం మేకర్స్ శాన్వి అడిగినందుకైనా ఛాన్స్ లు ఇస్తారో..?లేదో..?
కాగా ఈ సినిమాలో రక్షిత్ శెట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వనున్నాడు రక్షిత్ శెట్టి. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: