అజిత్ కు జోడీగా యామి గౌతమ్..!

Yami Gautam To Play Opposite Thala Ajith In His New Movie,Actress Yami Gautam New Movie News, Heroine Yami Gautam Upcoming Film News, latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Yami Gautam Latest News, Yami Gautam Next Film News, Yami Gautam Next Project Details, Yami Gautam To Star Opposite Ajith?

‘ఖాకి’ ఫేమ్ హెచ్ వినోత్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న 60వ చిత్రం ‘వలిమై’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ విలన్ గా నటించనున్నాడని గత రెండు రోజులనుండి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తుంది. వలిమై మేకర్స్ విలన్ గా వేరే వారిని ఎంపిక చేసే పనిలో ఉన్నారట. అసలు వారు కార్తికేయ ను సంప్రదించలేదని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఇప్పటికే ఇలియానా నటించనున్నట్టు వార్తలు రాగా ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. యామి గౌతమ్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

కాగా బోనీ కపూర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళికి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.