`మా అన్న‌య్య‌`, `సంక్రాంతి` త‌ర‌హాలో నాని చిత్రం?

Nani Once Again To Deliver A Wholesome Family Entertainer

`నిన్ను కోరి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత నేచుర‌ల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా `ట‌క్ జ‌గ‌దీష్‌`. రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేశ్ నాయిక‌లుగా న‌టిస్తున్న ఈ ఫ్యామిలీకి ఎంట‌ర్ టైన‌ర్ కి థ‌మ‌న్ బాణీల‌ను అందిస్తున్నాడు. సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే… రాజ‌శేఖ‌ర్ `మా అన్న‌య్య‌`, వెంక‌టేష్ `సంక్రాంతి` త‌ర‌హాలో `ట‌క్ జ‌గ‌దీష్` కూడా అన్న‌ద‌మ్ముల అనుబంధం నేప‌థ్యంలో సాగుతుంద‌ట‌. కాక‌పోతే `మా అన్న‌య్య‌`, `సంక్రాంతి`లో త‌మ్ముళ్ళ కోసం క‌ష్ట‌ప‌డే అన్న‌య్య చుట్టూ క‌థ తిరిగితే… `ట‌క్ జ‌గదీష్‌`లో మాత్రం అన్న‌ల కోసం క‌ష్ట‌ప‌డే త‌మ్ముడి చుట్టూ సినిమా తిరుగుతుంద‌ట‌. మ‌రి… ఈ క‌థ‌నాల్లో ఎంత నిజ‌ముందో తెలియాలంటే వ‌చ్చే ఏడాది ద్వితీయార్థం వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.