మన్యంలో RRR షూటింగ్

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం కొత్త షెడ్యూల్ ను మన్యంలో జరుపుకోనున్నట్టు తెలుస్తుంది. మండలంలోని, మోదాపల్లి డల్లాపల్లి ప్రాంతంలోని కాఫీ తోటల్లో వారం రోజుల పాటు క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఒకటి కాదు రెండు కాదు ‘ఆర్ఆర్ఆర్’ ను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.