RX100 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న కార్తికేయ ఆ తరువాత వరుసగా హిప్పీ, గుణ 369 అనే సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాడు. ఇప్ప్పుడు 90ఏంఎల్ అనే డిఫరెంట్ స్టోరీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ నేహా సోలంకి హీరో, హీరోయిన్లు గా కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కిన 90ఎంఎల్ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా కార్తికేయకు హిట్ ఇచ్చిందో..?లేదో..?రివ్యూ లో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు : కార్తికేయ, నేహా సోలంకి, రోల్ రైడ, రావు రమేష్, ప్రగతి, సత్య ప్రకాష్, అజయ్, రవికిషన్ తదితరులు..
దర్శకత్వం : యెర్ర శేఖర్ రెడ్డి
నిర్మాతలు : అశోక్ రెడ్డి గుమ్మకొండ
సంగీతం : అనూప్ రూబెన్స్
కథ:
కార్తికేయ అలియాస్ దేవదాస్ MBA గోల్డ్ మెడలిస్ట్ సాధించిన ఓ యువకుడు. కొన్ని కారణాల వల్ల ఆథరైజ్డ్ డ్రింకర్ గా మారతాడు. రోజుకు మూడు సార్లు అది కూడా 90ఎమ్ఎల్ మాత్రమే వేస్తుంటాడు. ఈ క్రమంలో దేవదాస్ ఫిజియోథెరపిస్ట్ సువాసస(నేహా సోలంకి) ప్రేమలో పడతాడు. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడుతుంది దేవదాస్ కు. సువాసన ఫ్యామిలీ ఆల్కహాలిజంకు పూర్తిగా వ్యతిరేకం. ఈ నేపథ్యంలో రోజుకు మూడుసార్లు 90ఎమ్ఎల్ కొట్టే దేవదాస్.. తన ప్రేమను ఎలా గెలుచుకుంటాడు..? తన ప్రేమను గెలుచుకోవడం కోసం ఎన్ని తిప్పలు పడ్డాడు అన్నది చూడాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అన్నిఎలిమెంట్స్ వుండేలా చూసుకున్నాడు డైరెక్టర్. ఇక కార్తికేయ ఎప్పటి లాగే తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. లవ్ ట్రాక్ లో హీరోయిన్ ను ఇంప్రెస్స్ చేయడానికి చేసే పనులు.. అలానే హీరోయిన్ ప్రేమను దక్కించుకోవడానికి పడే కష్టాలు ఇలా రెండు యాంగిల్స్ ను బాగా చూపించాడు. తన ఎనర్జిటిక్ డాన్స్ లు.. పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు కట్టిపడేస్తాయి. కామెడీ టైమింగ్ మరియు ఎమోషనల్ సన్నివేశాలలో కూడా బాగా మెప్పించాడు.
హీరోయిన్ కూడా తన పాత్రమేరకు బాగానే నటించింది. తన అభినయంతో ఆకట్టుకుంది. ఎమోషనల్ సన్నివేశాలలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ప్రేమకు కుటుంబానికి మధ్య నలిగిపోయే అమ్మాయిగా ఆమె ఒదిగిపోయింది. ప్రధాన విలన్ గా రవికిషన్ ఈ చిత్రంలో కచ్చితంగా కొత్తగా ట్రై చేశాడు అని చెప్పాలి. మేల్ ఫిమేల్ కాంబినేషన్ కాస్ట్యూమ్స్ లో ఆయన చేసే కామెడీ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా రావు రమేష్, రవి కిషన్, అజయ్, అలీ, ప్రగతి, రోల్ రైడా, పోసాని ఇంకా ఇతర నటీనటులు తమ పాత్రల మేర నటించారు.
అంతేకాదు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. చాలు చాలు అనే లవ్ సాంగ్, ఇనిపించుకోరు, వెళ్లిపోతుందే అనే పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో తోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా బావుంది. ప్రొడక్షన్స్ వాల్యూస్ రిచ్ గా వున్నాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ అది కనిపిస్తుంది.
ఓవరాల్ గా లవ్ ప్లస్ కామెడీ ప్లస్ యాక్షన్ సీన్స్ అన్ని కలిసి కూల్ అండ్ కిక్ ఇచ్చే సినిమా అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: