రేపు రానున్న ‘అశ్వ‌థ్థామ‌’ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్

Naga Shourya Ashwathama Movie Motion Poster Out Soon,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Ashwathama Movie Motion Poster,Ashwathama Movie Updates,Naga Shourya Ashwathama Movie Latest News,Naga Shourya New Movie Updates

‘నర్తనశాల’ సినిమాతో పరాజయంపాలైన కూడా యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన బ్యానర్ లో ‘అశ్వ‌థ్థామ‌’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేసింది చిత్రయూనిట్ . రేపు ( నవంబర్ 29 శుక్రవారం) సాయంత్రం 4:05 నిమిషాలకి కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు.

కాగా రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. అన్యాయాన్ని ప్రశ్నించే డైనమిక్ హీరోగా ఈ సినిమాలో నాగశౌర్య కనిపించనున్నాడట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.