నాగ్ కి జోడీగా కాజ‌ల్?

Kajal To Pair Up With King Nagarjuna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Upcoming Movie News,Kajal Aggarwal Latest Film Updates,Kajal Aggarwal Next Project Details

కింగ్ నాగార్జున ఓ కాప్ స్టోరీ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `ఊపిరి` ర‌చ‌యిత సాల్మ‌న్ డైరెక్ట్ చేయ‌నున్న ఈ సినిమాలో నాగ్ కి జోడీగా టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌బోతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అదే గ‌నుక నిజ‌మైతే… లావ‌ణ్య త్రిపాఠి, ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌రువాత అటు నాగచైత‌న్య‌తోనూ, ఇటు నాగార్జునతోనూ రొమాన్స్ చేసిన మూడో నాయిక‌గా కాజ‌ల్ చేరుతుంది. ఇదివ‌ర‌కు చైతూకి జోడీగా కాజ‌ల్ `ద‌డ‌` చిత్రంలో న‌టించిన విష‌యం విదిత‌మే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… తండ్రీకొడుకుల‌తో వేర్వేరు సినిమాల కోసం జోడీ క‌ట్టిన వైనం కాజ‌ల్ కి ఇదే తొలిసారి కాదు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో `మ‌గ‌ధీర‌`, `నాయ‌క్`, `గోవిందుడు అంద‌రి వాడేలే` చిత్రాల్లో న‌టించిన ఈ స్టన్నింగ్ బ్యూటీ… ఆపై మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న `ఖైదీ నంబ‌ర్ 150`లో ఆడిపాడింది. రెండు సంద‌ర్భాల్లోనూ ఘ‌న‌విజ‌యాలు చూసింది. మ‌రి… చైతూ ప‌క్క‌న మురిపించిన కాజ‌ల్… నాగ్ కి జంట‌గానూ మెస్మ‌రైజ్ చేస్తుందేమో చూడాలి. త్వ‌ర‌లోనే కాజ‌ల్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

ఇదిలా ఉంటే… నాగ్, సాల్మ‌న్ ప్రాజెక్ట్ డిసెంబ‌ర్ మూడో వారంలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని స‌మాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.