స్టార్ హీరోల చేతుల మీదుగా రిలీజ్ కానున్న ‘అతడే శ్రీమన్నారాయణ’ ట్రైలర్

Athade Srimannarayana Movie Trailer Release Date Fixed, Athade Srimannarayana Movie Updates, Athade Srimannarayana Telugu Movie Latest News, Athade Srimannarayana Telugu Movie Trailer Release Date Locked, Athade Srimannarayana Trailer Release Date, Athade Srimannarayana Trailer Release Date Confirmed, latest telugu movies news, Rakshit Shetty Starrer Athade Srimannarayana Trailer To Be Out Soon, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates

హీరో రక్షిత్ శెట్టి అంటే పెద్దగా అర్థంకాకపోవచ్చు కానీ హీరోయిన్ రష్మిక మాజీ లవర్ అంటే మాత్రం టక్కున బల్బ్ వెలుగుతుంది అందరికి. ‘కిరిక్ పార్టీ’ సినిమాలో కలిసి వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఇక ఈ సినిమా చేస్తున్నప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడం.. అది ఎంగేజ్మెంట్ వరకు వెళ్లడం…రెండేళ్ల పాటు సవ్యంగానే సాగిన వీరి ప్రేమకి కొన్ని నెలల క్రితం బ్రేకుల పడటం.. ఇవన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. ఇక ఇది వేరే స్టోరీ అనుకోండి..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు రక్షిత్ శెట్టి సచిన్ అనే దర్శకత్వంలో అతడే శ్రీమన్నారాయణ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని కన్నడంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వనున్నాడు రక్షిత్ శెట్టి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇక తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నవంబర్ 28వ తేదీన అంటే రేపు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని, తమిళ్ లో ధనుష్, మలయాళం లో నివిన్ పాల్ ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో రక్షిత్ శెట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.