`డైరెక్టర్ నంబర్ వన్` యస్.యస్.రాజమౌళి రూపొందిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. తెలుగు పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాలను మిళితం చేస్తూ జక్కన్న రూపొందిస్తున్న ఈ హిస్టారికల్ ఫిక్షన్ లో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ… ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఓ రొమాంటిక్ సాంగ్ ని పిక్చరైజ్ చేస్తోంది యూనిట్. చరణ్, ఆలియా భట్ కాంబినేషన్ లో వచ్చే ఈ డ్రీమ్ సాంగ్ కోసం ఓ భారీ సెట్ కూడా వేశారని సమాచారం. అంతేకాదు… ఈ గీతం సినిమాలో ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం.
కీరవాణి బాణీలు అందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`… 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























