చరణ్-అలియా రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ..!

RRR Movie Song Update,Huge Set For Ram Charan And Alia Bhatt Song in RRR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Movie Songs,RRR Songs,RRR Telugu Movie Songs,RRR Movie Songs Shooting Updates

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమచారం ప్రకారం.. సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటుందట. ఓ ప్రత్యేకమైన సెట్ లో రామ్ చరణ్-అలియా మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట.

ఇంకా ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.