బాల‌కృష్ణ – బోయ‌పాటి చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఫిక్స్?

Music Director Fixed For Balakrishna And Boyapati Srinu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Balakrishna And Boyapati Srinu Movie Updates,Music Director Locked For Balakrishna And Boyapati Srinu New Movie

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అచ్చొచ్చిన స్వ‌ర‌క‌ర్త‌ల్లో మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఒక‌రు. ముఖ్యంగా… వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన తొలి, మ‌లి చిత్రాలు `స‌మ‌ర‌సింహారెడ్డి`, `న‌ర‌సింహ‌నాయుడు` అయితే… అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఆపై `భ‌లేవాడివి బాసూ!`, `సీమ‌సింహం`, `చెన్న‌కేశ‌వ‌రెడ్డి`, `ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు`, `ల‌క్ష్మీ న‌ర‌సింహా`, `అల్ల‌రి పిడుగు`, `వీర‌భ‌ద్ర‌`, `ఒక్క మ‌గాడు`, `మిత్రుడు`, `ప‌ర‌మ‌వీర‌చ‌క్ర‌`, `ల‌య‌న్‌`… ఇలా మ‌రో ప‌ద‌కొండు సినిమాల కోసం ఈ సెన్సేష‌నల్ కాంబినేష‌న్ జ‌ట్టుక‌ట్టింది. క‌ట్ చేస్తే… ఐదేళ్ళ గ్యాప్ త‌రువాత బాల‌య్య‌, మ‌ణి కాంబినేష‌న్ లో మ‌రో చిత్రం రాబోతుంద‌ని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… `సింహా`, `లెజెండ్` త‌రువాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించ‌నున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ బాణీలు అందిస్తాడ‌ని ఆ మ‌ధ్య ప్ర‌చారం సాగింది. అయితే, తాజా స‌మాచారం ప్ర‌కారం… ఆ అవ‌కాశం మ‌ణిశ‌ర్మ‌కు ద‌క్కింద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి మ‌రింత‌ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

డిసెంబ‌ర్ 6న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… జ‌న‌వ‌రిలో రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ళ‌నుంది. వేస‌వి చివ‌ర‌లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.