ప్రతిష్ఠాత్మక చిత్రాల టీజర్స్ వరుసగా మూడు రోజుల పాటు సందడి చేయడం అరుదుగా జరుగుతుంటుంది. నవంబర్ 21, 22, 23 తేదీల్లో ఇలాంటి వాతావరణమే నెలకొంటోంది. ఈ మూడు రోజులు కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ టీజర్స్ హవా ఉండనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నవంబర్ 21 అంటే ఈ రోజు సాయంత్రం నటసింహా నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం `రూలర్`కి సంబంధించిన టీజర్ విడుదల కానుంది. ఇక నవంబర్ 22న అంటే రేపు (శుక్రవారం) సూపర్ స్టార్ మహేష్ బాబు అప్ కమింగ్ ఫిల్మ్ `సరిలేరు నీకెవ్వరు` టీజర్ రాబోతోంది. చిత్రదర్శకుడు అనిల్ రావిపూడి పుట్టినరోజు(నవంబర్ 23)కి ఒకరోజు ముందు ఈ టీజర్‌ని విడుదల చేస్తుండడం విశేషం. ఇక నవంబర్ 23న విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య మల్టీస్టారర్ `వెంకీమామ` తాలూకు టీజర్ రిలీజ్ కానుంది. చైతూ బర్త్ డే (నవంబర్ 23) స్పెషల్‌గా ఈ టీజర్‌ని విడుదల చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. మొత్తమ్మీద… వరుసగా మూడు రోజుల పాటు ఇలా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ తాలూకు ప్రచార చిత్రాలు విడుదల కావడం టాలీవుడ్ లో వార్తల్లో నిలుస్తోంది.
అన్నట్టు… రేపు (నవంబర్ 22) మరో క్రేజీ ప్రాజెక్ట్ `అల వైకుంఠపురములో` నుంచి `OMGdaddy` ఫుల్ సాంగ్ విడుదల కాబోతుండడం విశేషం. మరి… ఈ టీజర్స్, సాంగ్ ట్రీట్ ఆ యా కథానాయకుల అభిమానులను ఏ స్థాయిలో అలరిస్తాయో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: