రమేశ్ కడుముల దర్శకత్వంలో లక్ష్, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా ‘వలయం’. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ సినిమా డబ్బింగ్ ను లక్ష్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
DUBBING BEGINS…@DiganganaS #SekharChandra #RameshKadumula @sttvfilms #Valayam pic.twitter.com/ceSDIJPV6f
— Laksh Chadalavada (@actorlaksh) November 20, 2019
View this post on Instagram
DUBBING BEGINS… @diganganasuryavanshi #SekharChandra #RameshKadumula @sttvfilms #Valayam
కాగా ఈ సినిమాలో ఇంకా రవిప్రకాశ్, రవి వర్మ, నోయెల్ సేన్, చిత్రం శ్రీను తదితరులు నటించనున్నారు. బిచ్చగాడు, డి 16, టిక్ టిక్ టిక్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పలు చిత్రాలను తెలుగుప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామకృష్ణ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























