`ఛలో`(2018) చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు వెంకీ కుడుముల. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ని అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్… ప్రస్తుతం యువ కథానాయకుడు నితిన్‌తో `భీష్మ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోపే… తన మూడో చిత్రాన్ని పట్టాలెక్కించే దిశగా ప్రణాళిక రచిస్తున్నాడట వెంకీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు… హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుందని తెలిసింది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో… ఓ ప్రముఖ యువ కథానాయకుడు నటించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ జాయింట్ వెంచర్‌పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























