వివేక్ దర్శకత్వంలో సాయి పల్లవి, ఫహాద్ ఫాజిల్, ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘అథిరన్’ మూవీ ఎంత విజయం సాధించిందో తెలిసిందే కదా. ఇక ఫిదా సినిమాతో సాయి పల్లవికి తెలుగులో కూడా మంచి క్రేజ్ రావడంతో ‘అథిరన్’ సినిమాను కూడా తెలుగులోకి తీసుకొస్తున్నారు మేకర్స్. ఇన్ ట్రూప్ ఫిలిమ్స్ సమర్పణలో జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారినట్టు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమాను నవంబర్ 15న విడుదల చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం చెప్పిన తేదీకి విడుదల కావడం లేదని చిత్రయూనిట్ తెలిపింది. త్వరలోనే విడుదలకు సంబంధించి కొత్త తేదీని ప్రకటిస్తామని తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాతలు తెలిపారు. మరి చూద్దాం ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారో..?
మరి మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: