భాస్కర్ ఒక రాస్కల్ మూవీ నవంబర్ విడుదల

Bhaskar Oka Rascal Movie Releases In November,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Bhaskar Oka Rascal Movie Release Date,Bhaskar Oka Rascal Movie Updates,Bhaskar Oka Rascal Telugu Movie

కార్తికేయ మూవీస్ బ్యానర్ పై సిద్దిఖీ దర్శకత్వంలో అరవింద్ స్వామి, అమలాపాల్ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ భాస్కర్ ఒక రాస్కల్ నవంబర్ లో రిలీజ్ కానుంది. భాస్కర ఒరు రాస్కల్ తమిళ మూవీ కి తెలుగు డబ్బింగ్ వెర్షన్ భాస్కర్ ఒక రాస్కల్ మూవీ. నాజర్, నిఖిషా పటేల్, రోబో శంకర్, నైనిక ముఖ్య పాత్రలలో నటించారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భాస్కర్ ఒక రాస్కల్ మూవీ నిర్మాత పఠాన్ చాన్ భాషా మాట్లాడుతూ … సిద్దిఖీ దర్శకత్వంలో మమ్ముట్టి, నయనతార జంటగా రూపొందిన భాస్కర్ ది రాస్కల్ మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. అదే మూవీ ని అరవింద్ స్వామి, అమల పాల్ జంటగా తమిళ భాష లో భాస్కర ఒరు రాస్కల్ గా సిద్దిఖీ రూపొందించగా ప్రేక్షకాదరణ పొందిందని, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను తాను నిర్మించానని, నవంబర్ నెల రెండవ వారం లో ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహిస్తామని, అదే నెలలో భాస్కర్ ఒక రాస్కల్ మూవీ ని రిలీజ్ చేస్తామని, ఈ మూవీ లోని హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.