మెగా హీరో సాయితేజ్, యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. సత్యరాజ్, రావురమేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవల న్యూయార్క్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. దీంతో ఒక పాట, కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని టాక్. కాగా, నాయకానాయికలపై చిత్రీకరించబోయే ఈ పాటకు సంబంధించి హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను తీర్చిదిద్దే పనిలో ఉంది చిత్ర బృందం.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ప్రతి రోజూ పండగే’ను… డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: