`ఇష్టం`తో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన విక్రమ్ కె.కుమార్… `ఇష్క్`తో తెలుగునాట తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఆ తరువాత వచ్చిన `మనం`తో దర్శకుడిగా ఎనలేని గుర్తింపుని దక్కించుకున్నాడు. `మనం` అనంతరం మరో మూడు సినిమాలు చేసినా… ఆ స్థాయి విజయాన్నైతే అందుకోలేకపోయాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. అయినప్పటికీ… విక్రమ్‌కి ఓ క్రేజీ ప్రాజెక్ట్ దక్కిందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం క్రేజీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్… ఆ తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత విక్రమ్ కె.కుమార్‌తో ఓ మెగా ప్రాజెక్ట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడని టాక్. ఇప్పటికే చరణ్, విక్రమ్ మధ్య చర్చలు జరిగాయని… ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా 2020 చివరలో పట్టాలెక్కే అవకాశముందని టాక్.
మరి… చరణ్ చిత్రంతోనైనా విక్రమ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























