`డాన్ శీను`, `బలుపు` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత బి. మధు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇందులో రవితేజ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అతనికి జోడీగా శ్రుతి హాసన్ నటించనుందని టాక్. కాగా… ఈ సినిమాకి `క్రాక్` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. కథానుసారం ఈ టైటిల్ అయితేనే యాప్ట్‌గా ఉంటుందని యూనిట్ భావిస్తోందట. త్వరలోనే టైటిల్‌కి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇప్పటికే రెండు విజయాలు చూసిన రవితేజ, గోపీచంద్ కాంబో… కొత్త చిత్రంతో హ్యాట్రిక్ అందుకుంటుందేమో చూడాలి మరి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























