సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘రాజు గారి గది3’ సినిమా ఈ నెల 18వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం సాలిడ్ గానే వస్తున్నాయి. మూడు రోజుల్లో 3.75 కోట్ల షేర్ కలెక్ట్ చేసి మొదటి వీకెండ్ లో 70% రికవరీ చేసింది. మూడు రోజులకి మూడున్నర కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం ఐదు రోజులకుగాను రూ.4.7 కోట్లను, ప్రపంచవ్యాప్తంగా రూ.5.2 కోట్లను రాబట్టింది. ఇక నిన్నటి వసూళ్లను కూడా కలిపితే ఈ మొత్తం రూ.6 కోట్లకు చేరుకొని సేఫ్ జోన్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా దీపావళి వరకు పెద్దగా సినిమాలు లేవు కాబట్టి ఈ గ్యాప్ లో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. వీక్ డేస్ లో కూడా డీసెంట్ కలెక్షన్స్ తెచ్చుకుంటే డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలు వచ్చినట్టే.
కాగా ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అశ్విన్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఇంకా ఈ సినిమాలో అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, ఊర్వశి, అజయ్ ఘోష్ తదితరులు నటించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























