యాంకర్ శ్రీముఖి.. ఈ పేరు వింటేనే ఆమె చేసే అల్లరి గుర్తొస్తుంది. ‘పటాస్’ కార్యక్రమంతో అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పుడు సినిమాల్లో మెరుస్తూ అటు వెండి తెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 3 లో సందడి చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బిగ్ బాస్ 3 హౌస్ లో ‘వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్’.. టాప్ 3 లో ఉండే కాండిడేట్ ఎవరంటే శ్రీముఖి అని బిగ్ బాస్ చూస్తున్న ఎవరికైన అర్ధమవుతుంది. ఏదో బయట పాపులారిటీ ఉంది కదా.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా అని చెప్పి స్ట్రాంగ్ కంటెస్టెంట్.. టాప్ 5 లిస్ట్ లో ఉంటుంది అని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. బిగ్ బాస్ హౌస్ కు వచ్చేది సెలెబ్రిటీస్ కాబట్టి అందరికీ ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే ఉంటుంది. ఆ లాజిక్ లో చూసుకుంటే అందరూ టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ అలా కాదు కదా.. ఇంట్లో ఉండాలంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కటే సరిపోదు. ప్రేక్షకుల మనసు దోచుకోవాలి. టాస్క్ లు ఆడాలి.. ఎంటర్టైన్ చేయాలి.. స్టాండ్ తీసుకోవాలి.. సపోర్టివ్ గా ఉండాలి. ఇలా అన్ని క్వాలిటీస్ ఉంటేనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతారు. అలా అన్ని క్వాలిటీస్ శ్రీముఖికి ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
టాస్కుల్లో శ్రీముఖి పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హౌస్ మేట్స్ కు కూడా ఆ విషయం తెలుసు. చాలా ఫాస్ట్ గా గేమ్ ప్రాసెస్ ను అర్ధం చేసుకుంటది. అంతేకాదు చాలా తెలివిగా వేరే టీం వాళ్ళని బురిడీ కొట్టిస్తుంది. దానికి వరుణ్ సందేశ్ దగ్గర మనీ తీసుకున్న టాస్కె ఉదాహరణ. నాగార్జున కూడా శ్రీముఖి టాస్క్ లు ఆడే విధానంపై స్పందించి పొగిడారు కూడా. అసలు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా బలే ఆడతావమ్మా టాస్క్ లు అని.
ఇక హౌస్ లో శ్రీముఖి ఎంత ఎనర్జిటిక్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. హౌస్ లో ఉన్న కొంతమందికి అది ఓవర్ అనిపించినా 24 గంటలు అంత హైపర్ యాక్టీవ్ గా ఉండాలంటే మాములు విషయం కాదు. బాబా భాస్కర్, శ్రీముఖి కాంబినేషన్ అంటే అందుకే చాలా మందికి ఇష్టం. అంతే కాదు వాళ్లు ఉన్నారు కాబట్టే ఆ మాత్రమైనా కాస్త ఎంటర్టైనింగ్ గా ఉంది షో.. చూడగలుగుతున్నాం లేకపోతే చాలా బోర్ కొట్టేది అన్న కామెంట్స్ కూడా వచ్చాయి.
ఇక ఏదైనా ఒక విషయంలో స్టాండ్ తీసుకోవాలన్నా ఎప్పుడూ ఫస్టే ఉంటుంది. అంతేకాదు ఎవరైనా కాస్త డల్ గా ఉన్నా.. లో గా వున్నా కూడా శ్రీ మోరల్ సపోర్ట్ ఇస్తూ ఎంకరేజ్ చేసిన సందర్భాలు హౌస్ లో చాలానే చూసాం. అంతేకాదు హౌస్ లో మేల్ కంటెస్టెంట్ లకు పోటీ ఇవ్వాలన్నా.. వారికి ఎదురు తిరిగి సమాధానం చెప్పాలన్నా శ్రీముఖినే దైర్యం చేస్తుంది. ఇక బిగ్ బాస్ లో అందరికి కామన్ గా ఉండేది వెనుక మాట్లాడుకోవడం. నిజం చెప్పాలంటే ఈ క్వాలిటీ శ్రీముఖి కాస్త లేదనే చెప్పొచ్చు. ఏదైనా ఉంటే మొహం మీద చెబుతుంది తప్పా వేరే కంటెస్టెంట్ ల గురించి వెనుక మాట్లాడటం తక్కువే. అంతేకాదు ఎక్కడ రియాక్ట్ అవ్వాలి.. ఎక్కడ రియాక్ట్ అవ్వద్దు… అన్న విషయం కూడా శ్రీముఖికి బాగా తెలుసు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే అందరికీ అంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చి ఇన్ని రోజులు ఇంట్లో నిలిచింది. మరి ముందు ముందు కూడా శ్రీముఖి ఇలానే తన గేమ్ ను తానే ఇండివిడ్యువల్ గా ఆడి బిగ్ బాస్ టైటిల్ గెలవాలని కోరుకుందాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























