కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన తాజా తమిళ చిత్రం ‘ఖైదీ’. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఖైదీ’(1983) టైటిల్‌తో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే… గతంలో కార్తి అన్నయ్య సూర్య కూడా మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ మూవీ టైటిల్‌తో సందడి చేశాడు. ఆ చిత్రమే… `రాక్షసుడు`. 2015లో వచ్చిన ఈ సూపర్ నేచురల్ యాక్షన్ కామెడీ తెలుగునాట ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో… కార్తి అయినా మెగాస్టార్ బ్లాక్‌బస్టర్ టైటిల్‌తో ఘనవిజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























