లెజెండరీ యాక్ట్రెస్ @ 400

Yesteryear Actress Shavukaru Janaki To Act in Her 400th Movie,2019 Latest Telugu Movie News, Actress Sowcar Janaki Upcoming Project, Legendary actress Sowcar Janaki, Sowcar Janaki perform in her 400th movie, Sowcar Janaki Reaches A Unique Milestone, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళ్ లో శివాజీ గణేశన్, ఎం.జీ రామచంద్రన్ వంటి మహా మహిళతో నటించిన లెజెండరీ యాక్ట్రెస్ షావుకారు జానకి. ” షావుకారు” అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. అదే సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకొని.. తన సినీ ప్రస్థానం లో ఎన్నో సినిమాలు చేసి ఎంతో మంది హీరోయిన్స్ కు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇక తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ ఇలా పలు భాషల్లో ఇప్పటివరకూ దాదాపు 400 సినిమాల్లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటివరకూ 399 సినిమాల్లో నటించిన షావుకారు జానకి ఇప్పుడు 400 వ సినిమాలో నటించడానికి రెడీ అయ్యారు. కమలహాసన్‌తో నటించిన హే రామ్‌ చిత్రం తరువాత 14 ఏళ్లు గ్యాప్‌ తీసుకుని తమిళంలో వానవరాయన్‌ వల్లవరాయన్‌ చిత్రంతో రీ ఎంట్రీ అయ్యారు. అప్పుటి నుంచి ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో అప్పుడప్పుడూ ఒకటి రెండు చిత్రాల్లో తన నటనతో ఈ తరం ప్రేక్షకుల్నీ అలరిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఆర్‌.కన్నన్‌ దర్శకత్వంలో.. సంతానం కథానాయకుడిగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ లో వినోదభరిత పాత్రను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెట్ కు వచ్చిన ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఒక ఫోటో ను షేర్ చేస్తూ.. పూర్తి వినోదాత్మక కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో షావుకారు జానకి కూడా హాస్యం పండిస్తున్నారని, ఆమె నటన, ఈ వయసులోనూ ఆమె చూపే అంకితభావం తనను భ్రమింపజేశాయని దర్శకుడు ఆర్‌.కన్నన్‌ పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలుగా సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న షావుకారు జానకి ఈ చిత్రంతో ఈ తరం ప్రేక్షకుల్ని అలరించబోతున్నారని ఆయన చెప్పారు.

కాగా ఇది షావుకారు జానకి నటిస్తున్న 400వ చిత్రం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా… 2020 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.