సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. పూర్తి వినోదభరితంగా తెరకెక్కుతున్న ఈ మూవీ రీసెంట్ గా ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకొంది. మరొక షూటింగ్ షెడ్యూల్ తో మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈ మూవీ లో ఒక
స్పెషల్ సాంగ్ ఉంది. ఆసాంగ్ కు డాన్స్ లో తనదైన స్టైల్ ఉన్నతమన్నా ఎంపికయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నా తమన్నా ప్రత్యేక గీతాలలో నటించడానికి ఆసక్తి చూపుతారనే విషయం తెలిసిందే. అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ , కో (తమిళ్ ), జాగ్వార్, KGF చాప్టర్ 1 (కన్నడ ) మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. సరిలేరు నీకెవ్వరు స్పెషల్ సాంగ్ ను హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ ను రూపొందించి, నవంబర్ లో తెరకెక్కిస్తారని సమాచారం. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ కు డాన్స్ చేయడం ఉత్సాహం గా ఉంటుందని, ఒక మంచి మాస్ సాంగ్ కు డాన్స్ చేసి చాలా రోజులయిందని, అందుకే ఈ మూవీ సాంగ్ చిత్రీకరణకై ఆసక్తి తో ఎదురుచూస్తున్నానని తమన్నా తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























