ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న కథానాయికల్లో అనుష్క ఒకరు. ‘భాగమతి’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్… తాజాగా ‘సైలెన్స్’ అనే మల్టీలింగ్వల్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరుతో రిలీజ్ కానున్న ఈ చిత్రం… తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఆంగ్ల భాషల్లో ‘సైలెన్స్’గా విడుదల కానుంది. కాగా… చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `నిశ్శబ్దం` టీజర్‌ను స్వీటీ (అనుష్క) పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలినీ పాండేతో పాటు హాలీవుడ్ నటుడు మైఖెల్ మేడ్‌సన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి… హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు.
జనవరి 24న `నిశ్శబ్దం` ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు ప్రచారం సాగుతోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































