మ‌హాన‌టుడు య‌న్టీఆర్ కెరీర్‌లో మ‌రో మెమ‌ర‌బుల్ డేట్

October 21st A Very Memorable Date for Sr NTR,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019,Telugu Filmnagar, Tollywood Cinema News,Sr NTR Very Memorable Date,Sr NTR Memorable Date,Sr NTR Memorable October 21st

ఒకే తేదిని టార్గెట్ చేసుకుంటూ… వేర్వేరు సంవ‌త్స‌రాల్లో మూడు లేదా నాలుగు సినిమాల‌తో సంద‌డి చేసిన వైనాలు మహానటుడు నంద‌మూరి తార‌క రామారావు కెరీర్‌లో చాలానే ఉన్నాయి. అలాంటి తేదీల్లో అక్టోబర్ 21 ఒక‌టి. వేర్వేరు సంవ‌త్స‌రాల్లో ఇదే రోజున యన్టీఆర్ నటించిన నాలుగు చిత్రాలు విడుద‌ల కాగా… వాటిలో మూడు సినిమాలు మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా న‌టుడిగా త‌న‌కి మంచి గుర్తింపుని తీసుకువ‌చ్చాయి. ఆ చిత్రాలే… `జయసింహ’ (1955), `కోడలు దిద్దిన కాపురం`(1970), `యమగోల’(1977), `శ్రీ‌నాథ క‌వి సార్వ‌భౌముడు`(1993). వీటిలో `శ్రీ‌నాథ క‌వి సార్వ‌భౌముడు`ని మిన‌హాయిస్తే… మిగిలిన మూడు సినిమాలు విజ‌య‌కేత‌నం ఎగుర‌వేయ‌డ‌మే కాదు సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్స్‌గా నిలిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమిటంటే… ఈ నాలుగు చిత్రాలు కూడా ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని జోన‌ర్స్‌లో తెర‌కెక్కడం విశేషం. అలాగే… `కోడ‌లు దిద్దిన కాపురం` య‌న్టీఆర్ కెరీర్‌లో 200వ చిత్రం కాగా… `శ్రీ‌నాథ క‌వి సార్వ‌భౌముడు` కెరీర్‌లో చివ‌ర‌గా విడుద‌లైన సినిమా.

మొత్తానికి… అక్టోబ‌ర్ 21న వేర్వేరు సంవ‌త్స‌రాల్లో నాలుగు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌తో ప్ర‌జానీకాన్ని త‌న‌శైలి వినోదాల‌తో రంజింప‌జేశారు మ‌న ఎవ‌ర్‌గ్రీన్‌ య‌న్టీఆర్‌.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.