‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ ఇంట్రో సాంగ్‌లో త‌మ‌న్నా

Tamannaah Bhatia To Shake Leg With Superstar Mahesh Babu,Tamannaah To Be Part  Of Mahesh Babu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Tamannaah Bhatia Latest News,Actress Tamannaah Bhatia Upcoming Movie News,Tamannaah Bhatia Next Film Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Tamannaah Guest Role In Mahesh Babu Sarileru Neekevvaru Movie

ఒక‌ వైపు కథానాయికగా రాణిస్తూనే, మరోవైపు ప్ర‌త్యేక గీతాల్లోనూ సంద‌డి చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇప్పటికే పలు చిత్రాల్లో తన నృత్యాల‌తో మురిపించిన‌ ఈ టాలెంటెడ్ బ్యూటీ… త్వ‌ర‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ రూపొందుతున్న విషయం విదితమే. ఈ సినిమా ఆరంభంలో వ‌చ్చే ఇంట్రడక్షన్ సాంగ్‌లో… మ‌హేష్‌తో క‌ల‌సి తమన్నా సంద‌డి చేయ‌నుంద‌ని ఆ మ‌ధ్య కొన్ని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా ధ్రువీక‌రించింది తమన్నా. స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో ఈ పాటలో నర్తించడానికి ఒప్పుకున్నానని… మరోసారి మహేష్‌తో (‘ఆగడు’లో హీరోయిన్)కలసి ఆడి పాడ‌నుండడం సంతోషంగా ఉందని త‌మ్మూ తెలిపింది. అంతేకాదు… తనకి ‘ఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన అనిల్‌తో మ‌ళ్ళీ క‌ల‌సి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉందని మిల్కీ బ్యూటీ పేర్కొంది.

కాగా… మహేష్‌, రష్మిక మందన్న జంట‌గా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.