మంచోడు.. బిగ్ బాస్3 హౌస్ లో ఈ ట్యాగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి నుండి ఇదే మంచితనంతో ఉంటూ హౌస్ మేట్స్ చేత మంచోడు అని అనిపించుకున్నాడు రవి. కానీ ఫస్ట్ బానే ఉన్నా ఇప్పుడు మాత్రం అదే మంచోడు అన్నవాళ్ళు టార్గెట్ చేస్తూ… అనవసరంగా రవిని వేరే విషయాల్లో ఇరికిస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. ఏదో ఒకరోజు, రెండు రోజులు అంటే మంచోడిగా నటిస్తారేమో కానీ ఇన్ని రోజులు ఎవరూ నటించలేరు. బేసిక్ గా తన వ్యక్తిత్వమే అది అయినా కూడా అదే టార్గెట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హౌస్ లో జరిగిన చాలా సంఘటనలు రవి మంచితనం గురించి చెప్పకనే చెపుతాయి. దీనికి బెస్ట్ ఉదాహరణే తమన్నా ఎపిసోడ్. తమన్నా ఎన్ని మాటలు అన్న తాను మాత్రం ఏం అనకుండా చాలా ఓపికగా ఉన్నాడు. ఆ ఎపిసోడ్ తో తమన్నా ఇంటికి వెళ్లిపోయిందనుకోండి.
గ్లాస్ బ్రేక్ చేసిన సంఘటనలో కూడా అందరూ శ్రీముఖిని టార్గెట్ చేస్తుంటే.. తను మాత్రం శ్రీముఖి కి సపోర్ట్ గా నిలిచాడు.
టాస్క్ ఏదైనా కానీ వంద శాతం తనవంతు తాను కష్టపడతాడు. అంతే కాదు టాస్క్ చేసినా కూడా అక్కడఉన్నా లేడీ కంటెస్టెంట్ లకి ఎప్పుడూ అసౌకర్యం కలిగించలేదు.
అంతే కాదు రవి వీక్ కంటెస్టెంట్ అన్న మహేష్ కు లస్సీ టాస్క్ లో మహేష్ మీద గెలిచి తాను వేసిన కామెంట్ కు సమాధానం చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా క్వాలిటీసే ఉన్నాయి.
ఐతే ఈ మధ్య రవిని టార్గెట్ చేయడం ఎక్కువైందని చెప్పొచ్చు. నిజానికి హిమజ కోసం గ్లాస్ మంచి నీళ్లు కూడా తాగనని వితిక శ్రీముఖి తో చెప్పిన విషయం అందరూ చూశారు. కానీ అదే వితిక నేను అనలేదు ఆ మాట.. రవి అన్నాడు అంటూ తప్పు మొత్తం రవి పైకి నెట్టేసింది.
ఇక పునర్నవి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గేమ్ మీద కంటే ఫోకస్ మొత్తం రవి పైనే పెట్టినట్టుంది. రవి ఎక్కడ కనపడితే అక్కడ డైరెక్ట్ గా.. ఇన్ డైరెక్ట్ గా ఇలా ఏదో ఒకటి తిడుతూనే ఉంది. అంతే కాదు ఈవారం నామినేషన్ జరిగిన తర్వాత కూడా రవి గురించి మాట్లాడుతూ పునర్నవి తిడుతూ రెచ్చిపోయింది. ‘నువ్ రవితో మాట్లాడావా..?’ అంటూ వరుణ్.. వితికాని అడగడంతో ‘నేను ఎందుకు మాట్లాడతా..’ అని వితికా చెప్పేలోపు పునర్నవి కల్పించుకుని ‘వాడా…? ఆ రవిగాడా.. వాడొక వెదవ.. ఆ వెదవతో ఎందుకు మాట్లాడాలి.. వాడితో సొల్లు డిస్కషన్ ఎందుకు’ అంటూ బాబోయ్ ఇలా ఒకటా రెండా చాలానే తిట్టేసింది.
ఇంకా చాలా విషయాల్లో కూడా రవిని కావాలనే టార్గెట్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న కంటెస్టెంట్లలో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. కానీ కొంతమందితో పోల్చుకుంటే రవి ఫిజికల్ టాస్కూల్లో చాలా బాగా పెర్ఫర్మ్ చేస్తాడు. వెనక మాట్లాడే అలవాటు కూడా లేదు. కేవలం అక్కడున్న గ్రూపిజానికి బలై నామినేషన్స్ కి వస్తున్నాడు. సో అలాంటి కంటెస్టెంట్ ని హౌస్ లో ఉండేలా చూద్దాం.
మరి పేషన్స్, నిజాయితీ, మంచితనం ఇలా అన్ని క్వాలిటీస్ వున్న రవి ఇంకొన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి కదా. దానికి మీరు చేయాల్సింది రవి కి ఓట్ చేయడమే. ఓటింగ్ విధానం ఏంటంటే..
Hotstar యాప్ లో లాగ్ ఇన్ అయి Vote అనే బటన్ ని క్లిక్ చేసి రవి కి (10 ఓట్లు) వేయండి.
ఫోన్ ద్వారా మిస్డ్ కాల్స్ ఇవ్వాలంటే.. 8466996702 అనే నెంబర్ కు 50 మిస్డ్ కాల్స్ ఇవ్వండి (50 మిస్డ్ కాల్స్ = 50 ఓట్స్)
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























