ఎన్నో కమర్షియల్ హిట్స్ ను టాలీవుడ్ కు అందించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్లలో వి.వి వినాయక్ ఒకరు. ఇప్పుడంటే కొత్త కొత్త డైరెక్టర్స్ వచ్చి.. తీసిన సినిమాలు కాస్త ఆడక ఫామ్లో లేరు కానీ.. ఒకప్పుడు మంచి మంచి హిట్స్ అందించారు. ఇక ఇన్నేళ్లు డైరెక్టర్ గా కనిపించిన వినాయక్.. ఇప్పుడు హీరో కొత్త అవతారం ఎత్తనున్న సంగతి తెలిసిందే.
వినాయక్ హీరోగా త్వరలో సినిమా ప్రారంభమవుతున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లాంచ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 9న ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.
కాగా శంకర్ దగ్గర పనిచేసిన నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాతో నరసింహారావు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈసినిమా కథ 1980ల కాలంగా జరుగుతుందని తెలుస్తోంది. వినాయక్ అయితే ఈ సినిమాకు సరిగా సరిపోతాడని.. దిల్ రాజు స్వయంగా మాట్లాడి వినాయక్ ను హీరోగా ఒప్పించాడట. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. చూద్దాం మరి డైరెక్టర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందించిన వినాయక్ హీరో గా సక్సెస్ అవుతాడో? లేదో?
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: