చిరంజీవి `స్వయంకృషి`కి 32 ఏళ్ళు

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Chiranjeevi Swayamkrushi Film Completes 32 Years, Swayamkrushi Movie Completed 32 Years, 32 Years For Chiranjeevi Swayamkrushi, Chiranjeevi Latest Movie News, 32 Glorified Years for Swayamkrushi

మెగాస్టార్ చిరంజీవి న‌ట‌నావైభ‌వానికి ప్ర‌తీక‌గా నిలిచిన చిత్రాల‌లో `స్వయంకృషి` ఒక‌టి. ఇందులోని సాంబయ్య పాత్ర‌లో చిరు న‌టించిన తీరు విమ‌ర్శ‌కులను సైతం క‌ట్టిప‌డేసింది. అంతేకాదు… చిరుకి జోడీగా నటించిన విజయశాంతిని నటశిఖరాగ్రాన నిలబెట్టిందీ చిత్రం. సుమలత, సర్వదమన్ బెనర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో… మాస్టర్ అర్జున్, చరణ్ రాజ్, జె.వి.సోమయాజులు, బ్రహ్మానందం, పి.ఎల్.నారాయణ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. “కళాతపస్వి” కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని… పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డా.సి.నారాయణరెడ్డి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కలాల నుండి జాలువారిన పాటలకు… రమేష్ నాయుడు వీనుల విందైన సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా “చిన్నీ చిన్నీ కోరికలడగ”, “పారాహుషార్”, “సిగ్గూ పూబంతి” పాటలు ఇప్ప‌టికీ సంగీత ప్రియుల‌ను అల‌రిస్తూనే ఉన్నాయి. చిరు త‌న కెరీర్‌లో తొలిసారి నంది అవార్డును కైవసం చేసుకున్న ఈ చిత్రంతోనే… విజయశాంతి కూడా ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. 1987 సెప్టెంబర్ 3న విడుద‌లైన `స్వయంకృషి`… నేటితో 32 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.