ఈ సంవత్సరం ఆరంభంలో `118`తో థ్రిల్ చేసిన నందమూరి కళ్యాణ్ రామ్… ప్రస్తుతం `ఎంత మంచివాడవురా`తో బిజీగా ఉన్నాడు. `శతమానం భవతి` ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్‌కి జోడీగా మెహరీన్ నటిస్తుండగా… గోపీసుందర్ బాణీలు అందిస్తున్నాడు. శివలెంక కృష్ణప్రసాద్, ఉమేష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన తాజా షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవల కళ్యాణ్ రామ్, నటాషా దోషిపై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించిన యూనిట్… ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బృందంపై పోరాట ఘట్టాన్ని తెరకెక్కించే పనిలో ఉందట. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… `ఎంత మంచివాడవురా` 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























