‘వెంకీ మామ’లో స్కూల్ టీచర్‌గా రాశీ ఖ‌న్నా?

2019 Latest Telugu Film News, Raashi Khanna Turns School Teacher, Raashi Khanna To Play School Teacher, Raashi Khanna Role As School Teacher, School Teacher Raashi Khanna, Raashi Khanna Latest Movie News, Raashi Khanna Ropped An Interesting Role, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

`ఊహ‌లు గుస‌గుస‌లాడే` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది రాశి ఖ‌న్నా. మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీకి… మ‌ళ్ళీ ‘తొలిప్రేమ’తోనే ఆ స్థాయి కీర్తి ద‌క్కింది. కాగా… ప్రస్తుతం రాశి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాయిక‌గా న‌టిస్తోంది. ఆ చిత్రాలే… ‘వెంకీమామ’ (వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులు), ‘ప్రతీరోజు పండగే’ (సాయితేజ్ హీరో), విజ‌య్ దేవ‌ర‌కొండ – క్రాంతి మాధ‌వ్ కాంబినేష‌న్ మూవీ. వీటిలో నాగ‌చైత‌న్య‌కి జోడీగా న‌టిస్తున్న `వెంకీమామ‌`నే ముందుగా తెర‌పైకి రానుంది. అంతేకాదు… ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లో క‌నిపించ‌నుంద‌ట‌ రాశి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల‌ ప్ర‌కారం… `వెంకీమామ‌`లో స్కూల్ టీచర్ పాత్రలో దర్శనమివ్వనుందట రాశి. అంతేకాదు… అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర ఇదని తెలుస్తోంది. కాగా… ఇప్పటికే ఈ సినిమా ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకు రాగా… తాజాగా రాశి, వెంకటేష్ ఇద్దరూ కలసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

కాగా… కె.య‌స్.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ `వెంకీమామ‌` దసరా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.