`ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ చిత్రాలతో అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు నాగ్ అశ్విన్. కాగా…`మహానటి` తరువాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్… ఇప్పుడు తన మూడో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడట. `ఎవడే సుబ్రహ్మణ్యం`, `మహానటి` చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ఇందులో కథానాయకుడిగా నటిస్తాడని సమాచారం. ఇప్పటికే ఈ మేరకు విజయ్, అశ్విన్ మధ్య చర్చలు జరిగాయని టాక్. అంతేకాదు… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా `ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ చిత్రాలను నిర్మించిన స్వప్న సినిమా సంస్థ నిర్మించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్… క్రాంతి మాధవ్ డైరెక్టోరియల్, మల్టీ లింగ్వల్ మూవీ `హీరో`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే… `ఇస్మార్ట్` డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లోనూ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో… నాగ్ అశ్విన్‌తో చేయబోయే సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=750rHEFMc9M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























