ఇద్దరు హీరోలు గట్టెక్కినట్టే..!

2019 Latest Telugu Film News, Rakshasudu and Guna 369 Movies are in the safe zone, Rakshasudu Movie Latest News, Guna 369 Movie Latest News, safe zone Rakshasudu and Guna 369, Guna 369, Rakshasudu Movie, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Hero Karthikeya Upcoming Movie updates
Rakshasudu and Guna 369 Movies are in the safe zone

మొత్తానికి ఇద్దరు హీరోలకి కాస్త రిలీఫ్ దొరికింది. ఇంతకీ ఆ హీరోలు ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కార్తికేయ. ఎందుకంటే అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కీ, ఇటు కార్తికేయకూ ఈ సినిమా ఫలితాలు చాలా కీలకం. వాళ్ల భవిష్యత్తుని నిర్ణయించేవి ఈ చిత్రాలే. ఈ రెండు సినిమాలు అటో ఇటో ఐతే వారి కెరీర్ కే పెద్ద ప్రాబ్లెమ్ వచ్చి పడేది. ఈ గండం గట్టక్కాలంటే… తప్పకుండా ఈ సినిమాతో హిట్టు కొట్టాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ బడ్జెట్ తో, పెద్ద హీరో, స్టార్ హీరోయిన్ ఇలా అన్నీ హంగులతో గ్రాండ్ ఎంట్రీ నే ఇచ్చాడు సాయి శ్రీనివాస్. దాంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది. అంతే ఆ సినిమా తర్వాత మరే సినిమా ఆడింది లేదు. జయ జానకీ నాయక మాత్రం యావరేజ్ గా నిలిచింది. సాక్ష్యం, స్పీడున్నోడు, కవచం, సీత ఇలా అన్ని సినిమాలు ఫ్లాపులే. సరైన కథల్ని ఎంచుకోకపోవడమే కారణమని తాను కూడా ఒప్పుకునేవాడు. ఇప్పుడు తన ఆశలన్నీ ‘రాక్షసుడు’ సినిమాపైనే పెట్టుకున్నాడు. అంతేకాదు తన మొదటి సినిమా ఇదే అని రాక్షసుడు సినిమా ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో కూడా చెప్పాడు. ఇప్పుడు తను పెట్టుకున్న హోప్స్ కు ఫలితం దక్కింది. ఈ సినిమా మంచి టాక్ దక్కించుకుంది. ఎన్నో ఏళ్ళ తరువాత ‘రాక్షసుడు’ తో సాయి శ్రీనివాస్ కు మంచి హిట్ పడింది.

మరో వైపు కార్తికేయది కూడా ఇదే పరిస్థితి. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఆర్.ఎక్స్ 100 తో సంచలన విజయం సాధించి యూత్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఆ క్రేజ్ తోనే హిప్పీ తీసి బోల్తా కొట్టాడు. ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి, ఇచ్చిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. కానీ.. సినిమా ఫ్లాప్ అయ్యేసరికి.. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. దాంతో గుణ 369 పై తను చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాపై చాలా నమ్మకంగానూ ఉన్నాడు. తన చేతిలో ఉన్న సినిమాలకు మంచి మార్కెట్ అవ్వాలన్నా… ఇంకా మంచి సినిమాలు రావాలన్నా ఈ సినిమా హిట్ అవ్వాల్సిందే. లేదంటే.. తను వన్ సినిమా వండర్ గా మిగిలిపోయే ప్రమాదం వుంది. అందుకే… ‘గుణ 369’ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తానికి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కార్తికేయకు రిలీఫ్ ఇచ్చింది.

మొత్తానికి ఒకే రోజు వచ్చినా కూడా ఇద్దరు యంగ్ హీరోలకి మంచి ఫలితాలే దక్కాయి. ముందు ముందు కూడా మంచి సినిమాలతో మంచి హిట్స్ కొట్టాలని కోరుకుందాం.

[subscribe]

[youtube_video videoid=OWBRN_wbsI8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.